విశాఖ రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన ప్యాకేజీ....సాల్వెంట్ బాధితులకూ ఇవ్వాలన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు గేటు వద్ద ధర్నా చేస్తున్నా మృతదేహాన్ని వాళ్లకు చూపించకుండా.....దొడ్డిదారిన ఆసుపత్రికి తరలించడం దారుణమన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం, సీపీఐ, భాజపా, జనసేన, కార్మిక సంఘాల నాయకులను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఖండించారు. ప్రమాదానికి కారకులైన సాల్వెంట్ కంపెనీ బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ దుర్ఘటన: మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి - Massive fire mishap at Visakha
విశాఖ రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన సాల్వెంట్ కంపెనీ బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
visakha solvents plant victims