ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మాన్సాస్ చరిత్రలో ఇంత దయనీయ పరిస్థితి ఎన్నడూ లేదు' - మాన్సాస్ ట్రస్ట్ లెటెస్ట్ న్యూస్

విజయనగరం మాన్సాస్ ట్రస్ ఉద్యోగులు భిక్షాటన చేయడం కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ సంస్థ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదన్నారు. సజావునా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించారని ఆరోపించారు.

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Aug 20, 2020, 7:36 PM IST

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడు లేదన్న ఆయన... 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. ఇప్పుడెందుకిలా ట్రస్ట్ కు అప్రదిష్ట తెచ్చారని ప్రశ్నించారు. ఎంతో ఆర్థిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవాసంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరని చంద్రబాబు నిలదీశారు.

చంద్రబాబు ట్వీట్

సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి దుస్థితి మాన్సాస్ ట్రస్ట్ కు ఎప్పుడూ ఎదురు కాకూడదనే విజయనగరం రాజా పీవీజీ రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు ఫిక్స్ డ్ డిపాజిట్లతో ట్రస్ట్ ను ఆర్థికంగా పరిపుష్టి చేశారని గుర్తుచేశారు. అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి :'మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిండమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details