ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అనాగరిక పాలన సాగుతోంది: చంద్రబాబు - youth head tonsure by police in east godavari

రాష్ట్రంలో మళ్లీ అనాగరిక పాలన మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయారని విమర్శించారు. ఇసుక దందాను అడ్డుకున్నందుకు వైకాపా నేతలు దాడి చేశారన్నారు. యువకుడికి తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jul 21, 2020, 7:43 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మళ్లీ అనాగరిక పాలన వచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి పాలక పార్టీ సభ్యుల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా ఎందుకు మారారని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వైకాపాకి చెందిన నాయకులు వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు.

దళితుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తూ పోలీసుల సమక్షంలో చావబాది శిరోముండనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకే వరప్రసాద్ పై దాడి జరిగిందన్నారు. వరప్రసాద్‌కు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అనాగరిక చర్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి :కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్

ABOUT THE AUTHOR

...view details