ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. చెల్లింపులు లేక చిన్నచిన్న గుత్తేదారులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు తీసుకుంటున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లికే ఉపాధిహామీ నిధులు ఇచ్చుకున్నారన్న తెదేపా అధినేత... గతేడాది తమ హయాంలో రూ.9500 కోట్లు పనులు చేశామని వివరించారు. పనులు పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద గుత్తేదారులకు చెల్లిస్తూ... చిన్న గుత్తేదారులపై కక్ష తీర్చుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
'గుత్తేదారుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు తీసుకుంటున్నారు' - ap tazaa news
ఉపాధిహామీ పథకం నిధుల విడుదల కోరుతూ... సచివాలయం ఫైర్ స్టేషన్ సమీపంలో తెదేపా నేతలు ధర్నా చేశారు. కేంద్రం నిధులు విడుదల చేసినా... రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తెదేపా నేతల ధర్నా