ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"అక్కడ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించకపోవడం.. అసమర్థ పాలనకు నిదర్శనం" - ఏపీ తాజా వార్తలు

Chandrababu: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించకపోవడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులైనా పునరుద్ధరించకపోవడం.. వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కశ్మీర్‌లో వినిపించే ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత వార్తలు.. ఇక్కడా వినాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu
చంద్రబాబు

By

Published : May 31, 2022, 11:58 AM IST

Chandrababu: కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎక్కడో కాశ్మీర్​లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ అనేది ఇప్పుడు సామాన్యుడి జీవితంలో కూడా భాగమైందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని, ప్రభుత్వ ఉదాసీనత... వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details