ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తావన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఈ ప్రభుత్వం జీవో తెచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా ఈ జీవో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక మాధ్యమాల గొంతునొక్కే ప్రయత్నమేనన్న చంద్రబాబు... జీవో రద్దు కోసం అవసరమైతే పోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఆ జీవో రద్దు కోసం... పోరాటానికి సిద్ధం: చంద్రబాబు - మీడియా స్వేచ్ఛపై చంద్రబాబు కామెంట్స్
నిరాధార వార్తలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకునేలా... ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన పబ్లిషర్లు, ఎడిటర్లపై కేసులు నమోదు చేసే అధికారం కల్పించింది. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
ఆ జీవో రద్దు కోసం... పోరాటానికి సిద్ధం: చంద్రబాబు