ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నమ్మకం నిలబెట్టుకోకపోతే.. చరిత్రహీనులమే' - జగన్​పై చంద్రబాబు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా మాటమీద నిలబడి పాలన చేయాలని.. తెదేపా అధినేత చంద్రబాబు హితవు పలికారు. రివర్స్ జగన్ పేరిట చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది కాలంగా రద్దులు, జే టర్న్​లు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా నుంచి అమరావతి వరకు చెప్పినవేమీ చేయలేదని మండిపడ్డారు. అమల్లో ఉన్న 10 పథకాలు రద్దు చేసి ఆ డబ్బుతో ఒక్క పథకం అమలు చేస్తాననడం మోసమని ధ్వజమెత్తారు.

chandrababu criticises ycp government
వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

By

Published : Jun 5, 2020, 7:23 PM IST

వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

సీఎం జగన్ పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రివర్స్ జగన్ పేరిట వీడియో విడుదల చేశారు. ప్రజలు మీ మాటలు నమ్మి, మీ నాయకత్వాన్ని అంగీకరించినప్పుడు.. హామీలపై 'జే-టర్న్' తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే మీ నోటి వెంట వచ్చిన విశ్వసనీయత అనేది ఎక్కడున్నట్టు? అని నిలదీశారు.

అన్నింటిలోనూ వెనకడుగే

సన్న బియ్యం, కాళేశ్వరం, 45 ఏళ్లకే పింఛన్, ఉద్యోగుల సీపీఎస్, కరెంట్ చార్జీలు, రైతులకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి, యువతకు ఉపాధి.. ఇలా అన్నింటిలోనూ తీసుకున్న జే-టర్న్​లతో రాష్ట్రం తిరోగమనం బాట పట్టిందని దుయ్యబట్టారు. ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితం చేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని ఉద్ఘాటించారు. ఆ నమ్మకం నిలబెట్టుకోకపోతే చరిత్రహీనుల్లా మిగిలిపోతామని చంద్రబాబు అన్నారు.

ఇవీ చదవండి.... ఇసుక సరఫరాలో అధికారులు విఫలం: వైకాపా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details