చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కన్నా రాష్ట్రంలో వైకాపా వైరస్ ఇంకా భయంకరమైనదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ వైరస్ 8 నెలల్లోనే రాష్ట్రాన్ని చెల్లాచెదురు చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. విశాఖ మిలీనియం టవర్లోని కంపెనీలను తరిమేసి.. ఐటీ ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేనివాళ్లు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా అని ఎద్దేవా చేశారు.
కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు - వైకాపా ప్రభుత్వాన్ని కరోనా వైరస్‌తో పోల్చిన చంద్రబాబు
చైనాలో కరోనా కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా వైరస్ మరింత ప్రమాదకరమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడిదారులు పారిపోతున్నారని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.
![కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు chandrababu criticises ycp government on twitter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6002629-270-6002629-1581153916659.jpg)
వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు