మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో సహా పలువురు తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి తెదేపా నాయకులు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. ఇళ్లు కట్టి 13 నెలలైనా పేదలకు కేటాయించకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని నిలదీశారు.
అర్హులకు ఇళ్లు ఇవ్వమంటే.. అక్రమ అరెస్టులా? : చంద్రబాబు
తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే అర్హులకు అందించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్లు కేటాయించాలని తెదేపా చేపట్టిన ఆందోళనలో అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టును చంద్రబాబు ఖండించారు.
చంద్రబాబు
బండారు సత్యనారాయణ మూర్తిని మంగళవారం రాత్రి ఏడున్నర గంటల దాకా పోలీసు స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వం కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేసి హౌసింగ్ పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు.
ఇదీ చదవండి :శ్మశానాలనూ వదలకుండా దోచుకుంటున్నారు: తెదేపా అధినేత చంద్రబాబు