ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామకృష్ణారెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: చంద్రబాబు - chandrababu condemned ramakrishna reddy arrest

తెదేపా నేత రామకృష్ణారెడ్డి అరెస్ట్​ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సంబంధంలేని విషయంలో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. బేషరతుగా రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ramakrishna reddy arrest
ramakrishna reddy arrest

By

Published : Mar 12, 2021, 4:43 PM IST

సీఎం జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై జగన్​రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి చర్యలతో ప్రజాస్వామ్యం పతనం అవుతోందన్నారు. వికృత రాజకీయాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తెదేపా నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. సంబంధం లేని అంశంలో అక్రమంగా కేసు నమోదు చేసి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో, రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేవని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు.. ఇంతకింత అనుభవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వెంటనే రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి బేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details