ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలి:చంద్రబాబు - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు

నేటి అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా...తెదేపా అమరావతి ఐకాస నేతల అక్రమ అరెస్టులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వ దమనకాండ చర్యగా అభివర్ణించారు.

chandrababu-condemn-house-arrests-over-amravthi-issue
chandrababu-condemn-house-arrests-over-amravthi-issue

By

Published : Jan 20, 2020, 4:28 AM IST

Updated : Jan 20, 2020, 7:42 AM IST


తెలుగుదేశం, అమరావతి ఐకాస నేతల గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్ట్ లను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది వైకాపా ప్రభుత్వ దమనకాండ చర్యంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా దేశంలో ఇంత నిర్బంధం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్న ఆయన... పౌరుల ప్రాథమిక హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. రాజ్యాంగం మౌలిక సూత్రాలను కాలరాసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. వైకాపా అరాచకాలకు అంతు లేకుండా పోయిందని ఆక్షేపించారు. తక్షణమే గృహ నిర్బంధాలను ఎత్తివేయటంతో పాటు...అక్రమ అరెస్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : Jan 20, 2020, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details