ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంకులు హత్యపై చంద్రబాబు ఆగ్రహం... 19 నెలల్లో 16 మందిని చంపేశారని ఆందోళన... - మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు

మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 16 మంది తెదేపా కార్యకర్తలను మట్టుబెట్టారని ఆరోపించారు. మాజీ సర్పంచి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

chandrababu
chandrababu

By

Published : Jan 4, 2021, 9:09 AM IST

గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైకాపా హత్యా రాజకీయమేనని ఆరోపించారు. 20ఏళ్లు సర్పంచిగా పనిచేసిన అంకులును హత్య చేయడం కిరాతక చర్యని ధ్వజమెత్తారు. గత 19నెలల్లో 16 మంది తెదేపా కార్యకర్తలను మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైకాపా హత్యా రాజకీయాలకు నిదర్శనాలన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైకాపా నాయకులు శాంతి భద్రతలను అధఃపాతాళానికి దిగజార్చారని విమర్శించారు. మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైకాపా హత్యారాజకీయాలను ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details