ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు - ప్రకాశం జిల్లాలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్తపై కత్తులతో దాడి చేయటాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దౌర్జన్యకాండ పేట్రేగిపోయిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

chandrababu
chandrababu

By

Published : Nov 22, 2020, 3:25 PM IST

ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. తెలుగుదేశం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్త కృష్ణయ్య యాదవ్ తో పాటు వీరాస్వామి యాదవ్ లపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చడాన్ని చంద్రబాబు ఖండించారు. తీవ్ర గాయాల పాలైన కృష్ణయ్య, వీరాస్వామిలకు వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దౌర్జన్యకాండ పేట్రేగిపోయిందని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు చేసి, భయపెట్టడం ద్వారా రాష్ట్రాన్ని నేరగాళ్ల ఇష్టారాజ్యంగా చేస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా నేతల తీరు వల్లే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు వైకాపా ఘాతుకాలు మితిమీరాయని,175 నియోజకవర్గాల్లో రోజురోజుకూ వైకాపా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలే వైకాపాకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. బాధిత వర్గాలన్నీ ఏకమై తిరగబడితే వైకాపా తోక ముడవక తప్పదని ఆయన హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details