ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా దౌర్జన్యాలు అప్రజాస్వామికం: చంద్రబాబు - chandrababu latest news

రైతులు, రైతు కూలీలపై కేసులు పెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ 65 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Chandrababu condemn attack on farmers
వైకాపా దౌర్జన్యాలు అప్రజాస్వామికం: చంద్రబాబు

By

Published : Feb 20, 2020, 4:26 PM IST

అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాల నెపంతో ఈ విధమైన దౌర్జన్యాలు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలకు వైకాపా ప్రభుత్వం స్వస్తి చెప్పాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details