గత 6 నెలల్లో వైకాపా ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే.... అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కొద్ది నెలల పాలనలో దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధీ చేయలేదన్నారు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని ప్రారంభించి రద్దులు, మూసివేతలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
'వైకాపా ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది' - చంద్రబాబు తాజా వార్తలు
గత 6 నెలల్లో వైకాపా ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే...... అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ 6 నెలల్లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదన్నారు.
chandrababu-comments-on-ysrcp