సబ్బం హరి ఇంటిని కూల్చేయడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదని విమర్శించారు.
సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
తెదేపా నేత సబ్బంహరి ఇంటిని కూల్చడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
chandrababu