ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆయన కరోనా బారిన పడటం బాధాకరం: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కొవిడ్ బారిన పడటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మొన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణం ఎవరని చంద్రబాబు నిలదీశారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Aug 19, 2020, 1:09 PM IST

తెదేపా నేత జేసీ ప్రభాకర్‍రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరమని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‍పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా నిబంధనలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మళ్లీ కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

‘‘దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా?. అచ్చెన్నాయుడు, ప్రభాకర్‍రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణం ఎవరు?. కరోనా ముప్పు తెలిసీ ప్రజానాయకుల పట్ల దారుణంగా నడుచుకుంటున్నారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details