హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాశ్రేయస్సు పట్ల తెదేపాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్ అని ఆయన గుర్తుచేశారు. సాప్ట్వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచేనని, అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయని బాబు గుర్తుచేశారు.
బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి ప్రముఖులను రప్పించి భావితరానికి బాటలు వేశామన్నారు. ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం ఇవే లక్ష్యంగా ముందుకు సాగామన్నారు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు తెలుగు దేశానివేనని సగర్వంగా చెప్పగలమన్నారు.