ముఖ్యమంత్రి జగన్ కరోనా నియంత్రణకు పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ స్థాయికి మించి ఆలోచన చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్.. భారతదేశంలో రెండవ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. మద్యం దుకాణాల వెలుపల క్యూలు, వైకాపా సూపర్ స్ప్రెడర్ల కారణంగా కరోనాను సమర్థవంతంగా నియంత్రించలేకపోయారని విమర్శించారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ మెకానిజం విచ్ఛిన్నం కావటంతో విపత్తుకు దారి తీసిందని తెలిపారు.
సీఎం గారూ.. కరోనాపై కాస్త స్థాయికి మించి ఆలోచించండి: చంద్రబాబు - ఏపీలో కరోనా కేసులు
సీఎం జగన్ పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ స్థాయికి మించి ఆలోచన చేస్తే బాగుంటుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దేశంలో కరోనా కేసుల ప్రవాహంలో.. రాష్ట్రం రెండవ స్థానంలో ఉండటం ప్రభుత్వం వైఫల్యాలకు నిదర్శనమన్నారు.
chandrababu