పాలకులు శాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాను ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని....ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. పాలకుల మెప్పు కోసం 'ఖాకిస్టోక్రసీ' ప్రదర్శిస్తున్నారని సీఐడీని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు చేసిందంటే.... పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
అప్రజాస్వామిక కుట్రను న్యాయపోరాటంతో ధైర్యంగా తిప్పికొట్టి పాత్రికేయ స్వేచ్ఛను కాపాడారంటూ తెలుగు వన్ ఎండీ రవిశంకర్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తమ స్వప్రయోజనాల కోసం పాలకులకు దాసోహం కాకుండా తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.