ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"నాకు కులం అంటగట్టే వారికిదే సమాధానం" - తుళ్లూరులో చంద్రబాబు పర్యటన

కులం పేరిట తనపై విమర్శలు చేస్తున్న వారందరికి తెదేపా అధినేత చంద్రబాబు... తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. తనను కులం పేరిట విమర్శించే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలని సూచించారు.

Chandrababu
చంద్రబాబు నాయుడు

By

Published : Jan 2, 2020, 6:00 AM IST

తుళ్లూరులో మాట్లాడుతున్న చంద్రబాబు
పదిహేను రోజులుగా అమరావతి రైతులు చేస్తోన్న మహాధర్నాకు తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సంఘీభావం తెలిపారు. అమరావతి గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు దంపతులు రైతన్నల గుండెల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. బుధవారం తుళ్లూరులో మాట్లాడిన చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. కులం పేరిట తనను విమర్శించే నేతలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.


" కొందరు పదే పదే నాకు కులం ఆపాదించి విమర్శిస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మరో 30 ఏళ్లకు రాష్ట్రంలో ఉండే అనేక కులాలు అంతమయిపోతాయి. ఇంకా కులాన్ని పట్టుకునే వాగేవారు ఈ నిజం తెలుసుకోండి. నేను మహా అయితే ఇంకో 10 ఏళ్లు ఉంటానేమో.. అమరావతి భవితను కూడా నేను చూడలేకపోవచ్చు కానీ... కుల, మత తారతమ్యం లేని నేటి ఈ పిల్లలే.. రేపు.. ప్రపంచంలోని 5 అగ్ర నగరాల్లో ఒకటిగా ఎదగబోతున్న అమరావతిని చూస్తారు. నన్ను కులం పేరుతో వేధిస్తున్న వారికిదే నా సమాధానం. నా మరణం తర్వాత మీకు నిజాలు తెలుస్తాయి. నాకు లేని కులపిచ్చిని అంటగట్టి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ కుటుంబాలకు మీరే ఆధారం. జగన్ పన్నే వలలో పడి మీ జీవితాలు వృథా చేసుకోవద్దు." .... చంద్రబాబు, తెదేపా అధినేత

ABOUT THE AUTHOR

...view details