CBN On Army Helicopter Crash: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు మరికొందరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురికావటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
తమిళనాడులో ప్రమాదం..
తమిళనాడు కూనూర్ సమీపంలో మిలిటరీ చాపర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్లో.. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి. సైన్యం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్నవారు..
- సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్
- మధులిక రావత్(బిపిన్ రావత్ సతీమణి), DWWA ప్రెసిడెంట్
- బ్రిగెట్ ఎల్ఎస్ లిద్దర్
- లెఫ్టినెంట్ కర్నల్ హరీందర్ సింగ్
- ఎన్కే గురుసేవక్ సింగ్
- ఎన్కే జితేంద్ర కుమార్
- ఎల్/ఎన్కే వివేక్ కుమార్
- ఎల్/ఎన్కే బి సాయి తేజ
- హావిల్దార్ సత్పాల్