వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. 'అమ్మఒడి' పేరిట బెదిరించి తల్లుల నుంచి వెయ్యి రూపాయలు వసూళ్లు చేయడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవ్వకపోతే మొత్తం రూ.15 వేలు ఆపేస్తామని బెదిరిస్తారా..? ఆ అధికారం మీకు ఎక్కడిదని నిలదీశారు. బడుల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమీషన్లు కొట్టేసే 'దొంగమామలను ఇప్పుడే చూస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిడ్డలూ- అమ్మలూ- కాస్త జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు.
చివరికి బడుల్లోనూ రౌడీ వసూళ్లేనా?: చంద్రబాబు - chandrababu fire on Amma vodi news
'అమ్మఒడి' పేరిట బెదిరించి తల్లుల వద్ద నుంచి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అలా ఇవ్వకపోతే మొత్తం పదిహేను వేలు ఆపేస్తామని బెదిరిస్తారా అని ప్రశ్నించారు.
chandrababu comments on Amma vodi scheme over Collect the money from parents