వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు(chandrababu news). వరద ప్రాంతాల్లోని పార్టీ నేతలతో సమీక్షించిన ఆయన.. బాధితులకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలన్నారు.
వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందన్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని తెలిపారు.