ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్టీఆర్, పీవీలను రాజకీయాల కోసం రచ్చకీడుస్తారా? : చంద్రబాబు - chandrababu latest news

తెలుగు వారికి గర్వకారణంగా.. జాతీయ రాజకీయాలకు వన్నెతెచ్చిన మహనీయులు ఎన్టీఆర్, పీవీ నరసింహారావులని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అంటువంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం సరికాదన్నారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. ఈ రకమైన వ్యాఖ్యలు తెలుగువారందరినీ అవమానించడమేనని మండిపడ్డారు.

chandrababu
chandrababu

By

Published : Nov 26, 2020, 9:07 PM IST

ఎన్టీఆర్, పీవీ నరసింహారావు వంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు వారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన వ్యక్తులు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు అన్నారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేస్తే, ఎన్నో సంస్కరణలతో దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ అని చంద్రబాబు కొనియాడారు.

హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసునన్న చంద్రబాబు... ఆ పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ ఘాట్​ను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్​పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమేనని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details