ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నేతలు, ప్రముఖులు

By

Published : Apr 20, 2020, 8:33 PM IST

చంద్రబాబుకు పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పేర్కొన్నారు. ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారన్న నేతలు... రాష్ట్రాభివృద్ధికి బాబు చేసిన సేవలు ఎనలేనివన్నారు.

chandrababu-birthday-celebrations
chandrababu-birthday-celebrations

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పలువురు నేతలు శుభాంకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని భాజపా సీనియర్‌నేత నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సురేష్ ప్రభుతో పాటు రాష్ట్ర సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా, రాజ్యసభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి మాణిక్యలరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజ‌ల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న ఆయన రాష్ట్రాభివృధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాగే హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్​కల్యాణ్​ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడపాలని పవన్ కల్యాణ్‌ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details