ముస్లిం సోదరులకు చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు - ముస్లిం సోదరులకు చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు తెదేపా అధినేత చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈర్ష్య, అసూయద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలంటూ పేర్కొన్నారు.
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండగ ప్రజలందరి మధ్య శాంతి, సుహృద్భావాలను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈర్ష్య, అసూయ ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుందామంటూ పోస్ట్ చేశారు.