ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుగ్లక్​తో జగ్లక్​కు పోలికే లేదు: సీపీఐ రామకృష్ణ - chandrababu at rayapudi diksha shibiram news

రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ.. రాయపూడిలో రైతులు చేస్తున్న ఆందోళనకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, ఐకాస నేతలతో కలిసి రాయపూడి దీక్షా శిబిరానికి వెళ్లారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు.

'ఒక్క రాజధాని నిర్మించలేని సీఎం జగన్.. 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు'
'ఒక్క రాజధాని నిర్మించలేని సీఎం జగన్.. 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు'

By

Published : Feb 5, 2020, 1:28 PM IST

Updated : Feb 5, 2020, 1:47 PM IST

తుగ్లక్​తో జగ్లక్​కు పోలికే లేదు: సీపీఐ రామకృష్ణ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రాయపూడిలో రైతుల చేస్తున్న ఆందోళనలకు దీక్షా శిబిరానికి చేరుకుని చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు మాట్లాడారు. 'దిల్లీలో అమరావతి ఐకాస సభ్యులు కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. రాజధాని గ్రామాలకే కాదు... ఇది రాష్ట్ర సమస్య అని వివరిస్తున్నారు. మంచి కార్యక్రమానికి భూములు ఇచ్చినందున విజయం సాధిస్తాం.' అని ఐకాస నేతలు పేర్కొన్నారు.

రైతుల ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతోందని సీపీఐ నేత రామృష్ణ అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 50 రోజులుగా పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి గ్రామాల రైతుల పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు. ఒక్క రాజధాని నిర్మించలేని సీఎం జగన్.. 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని.. మూడు రాజధానులు కావాలని సీఎం జగన్‌ను ఎవరైనా అడిగారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. '50 రోజుల పోరాట చరిత్ర వినూత్నమైనది. దేశంలో ఎన్నో పోరాటాలు చేశాం. అమరావతి రైతుల పోరాటం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఈ పోరాటం తప్పక విజయమంతమవుతుంది. రైతుల పోరాటానికి ప్రభుత్వం దిగి రాక తప్పదు. తుగ్లక్ గొప్ప యుద్ధ వీరుడు... జగ్లక్ కు అతనితో పోలిక లేదు. వ్యక్తిగత ద్వేషంతో జగ్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చావు.. మిగతా వాటి సంగతేంటి..? గోకరాజు గంగరాజు కుమారుడిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నావు. రాజధానిని మారుస్తావని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు..?. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు.. నీవు ఉంటే రాష్ట్రానికి భవిష్యత్ లేదు. సీపీఐ జాతీయ సమావేశాల్లో మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాం, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేశాం' అని రామకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి: రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేం: సీఎం జగన్‌

Last Updated : Feb 5, 2020, 1:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details