భారత మహిళా పైలెట్ల చరిత్ర సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కెప్టెన్ జోయ అగర్వాల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఉత్తర ధ్రువం మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బోయింగ్ 777 నడపడం భారత వైమానిక రంగానికే గర్వకారణమని కొనియాడారు. 16గంటల్లో ఎక్కడా ఆగకుండా 13వేల 993కిమీ విమానం నడిపడాన్ని ప్రశంసించారు. ప్రపంచ చరిత్రలోనే వాణిజ్యవిమానం సుదీర్ఘ దూరం నడిపిన ఘనత మన మహిళా పైలెట్లదేనన్న చంద్రబాబు... ఇందుకు దేశమంతా గర్విస్తుందని అభినందించారు.
కెప్టెన్ జోయా అగర్వాల్ బృందానికి చంద్రబాబు అభినందనలు - chandraabu praise women pilots
ప్రపంచంలో రెండో అతిపెద్ద బోయింగ్ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన కెప్టెన్ జోయా అగర్వాల్ బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ఇందుకు దేశమంతా గర్విస్తుందన్నారు.
కెప్టెన్ జోయా అగర్వాల్ బృందానికి చంద్రబాబు అభినందనలు