వైకాపా ఏడాది పాలన పై 'అప్పుడు ముద్దులు... ఇప్పుడు పిడిగుద్దులు' పేరిట వీడియోను ట్విట్టర్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ముద్దులు పెట్టి ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారని... తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను ధరల భారం మోయాలని అంటున్నారని విమర్శించారు.
ఏడాదిలో కోతలరాయుడి ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి... అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.