ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ - TDP state president achennaidu appointment

chandrababu-announces-tdp-committees
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న

By

Published : Oct 19, 2020, 12:26 PM IST

Updated : Oct 19, 2020, 4:12 PM IST

12:24 October 19

తెదేపా కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు

తెదేపా జాతీయ కార్యవర్గం

తెలుగుదేశం సారధివర్గాన్ని ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు రాష్ట్రాల కమిటీలతో పాటు....పార్టీ కీలక నిర్ణయ కమిటీ పొలిట్‌బ్యూరోను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్న అనుభవజ్ఞులతో పాటు...యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుకు పగ్గాలు అప్పగించారు. తెలంగాణ అధ్యక్షుడిగా మరోసారి ఎల్. రమణనే కొనసాగించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగనుండగా.... ఆరుగురిని ఉపాధ్యకులుగా నియమించారు. పార్టీ సీనియర్ నేతలు కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డీకే సత్యప్రభతోపాటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావు, చిలువేరు కాశీనాథ్‌కు అవకాశం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్‌కు మరోసారి అవకాశం కల్పించగా... యువనేత రామ్మోహన్‌నాయుడును జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరితోపాటు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కాని నరసింహులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. కంభంపాటి రామ్మోహన్‌రావుకు జాతీయ రాజకీయ వ్యవహరాల ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. సంస్థాగత రాజకీయ కార్యదర్శిగా టీడీ జనార్దన్‌ను నియమించారు.

జాతీయ అధికార ప్రతినిధులుగా దీపక్‌రెడ్డి, పట్టాభిరామ్‌, మహమ్మద్ నసీర్‌, ప్రేమ్‌కుమార్ జైన్‌, జ్యోత్స్నాను నియమించారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించగా... మునిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంతు వెంకటేశ్వరరావును సభ్యులుగా నియమించారు. పార్టీ జాతీయ కోశాధికారిగా శ్రీరాం తాతయ్యకు బాధ్యతలు అప్పగించారు. 

25 మందితో పొలిట్ బ్యురో ఏర్పాటు..

యువ-సీనియారిటీకి పెద్దపీఠ వేస్తూ 21మందితో తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరోను అధినేత చంద్రబాబు నియమించారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మరో నలుగురితో కలిపి 25మందితో నూతన పొలిట్ బ్యూరో ఏర్పాటైంది. కొత్తగా 12మందికి పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. గతంలో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 12మందితో ఉన్న పొలిట్ బ్యూరో ఇప్పుడు 25కి పెరిగింది. పొలిట్ బ్యూరో సభ్యుల్లో 60శాతం బీసీలకు అవకాశం కల్పించగా..., కమ్మ - కాపు సామాజిక వర్గ నేతలకు సమప్రాధాన్యం ఇచ్చారు. కుల‌, మత, ప్రాంత‌, మ‌త స‌మీక‌ర‌ణాల‌న్నీ పాటిస్తూనే... పార్టీ కేడ‌ర్ అభిప్రాయాలు సేక‌రించి..అత్యధికులు సూచించిన వారినే పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. 

పొలిట్ బ్యురోలోకి బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ, కళా వెంకట్రావ్, నక్కా ఆనంద్ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా, ఫరూఖ్, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, అరవింద కుమార్ గౌడ్ లను కొత్తగా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. వీరితో పాటు గత పొలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, వర్ల రామయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు పొలిట్ బ్యూరోలో కొనసాగనున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎల్.రమణ, పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ లకు పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరించనున్నారు. 

ఇదీ చదవండి:

ఇసుక సరఫరాపై ఇవాళ కీలక నిర్ణయం..!

Last Updated : Oct 19, 2020, 4:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details