''ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇంకెందరు బలికావాలి?''
ఇసుక కార్మికుల ఆత్మహత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ ఘటనలు తనను కలిచివేస్తున్నాయన్నారు. వారంలో 10 మంది ఇలా చనిపోయారంటూ ట్వీట్ చేశారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆక్షేపించారు. ''వీళ్ళ బాధ్యతా రాహిత్యానికి ఇంకెంతమంది బలికావాలి?'' అని ట్విటర్లో ప్రశ్నించారు.
Chandrababu Naidu