Tributes to Nandamuri Harikrishna నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు ఆయన స్మృతికి నివాళులర్పించారు. మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చంద్రబాబు కొనియడారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని లోకేశ్ అన్నారు. ముక్కుసూటితనం నందమూరి హరికృష్ణ నైజమని, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనే ప్రత్యేకత అని కొనియడారు.
నందమూరి హరికృష్ణ వర్ధంతి, నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ - నందమూరి హరికృష్ణ
Tributes to Nandamuri Harikrishna నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు ఆర్పించారు. మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చంద్రబాబు కొనియడారు. రాజకీయాల్లో, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని లోకేశ్ తెలిపారు.
చంద్రబాబు, లోకేశ్