ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హరికృష్ణ వర్ధంతి: చంద్రబాబు, లోకేశ్ నివాళి - news on harikrishna

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక సేవలు అందించారని హరికృష్ణను చంద్రబాబు కొనియాడారు.

Chandrababu and Nara Lokesh pay tributes to Harikrishna
హరికృష్ణకు చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులు

By

Published : Aug 29, 2020, 9:59 AM IST

చంద్రబాబు ట్వీట్

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులు అర్పించారు. హరికృష్ణ అంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత అని చంద్రబాబు కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, నిరాడంబరతకు ప్రతిరూపమని.. కొనియాడారు.

లోకేశ్ ట్వీట్

పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. హ‌రి మామయ్య మాకు దూర‌మై నేటికి రెండేళ్లవుతోందని నారా లోకేశ్‌ గుర్తు చేసుకున్నారు. చైత‌న్య ర‌థ‌సార‌థి, న‌ట‌న‌లో రాజ‌సం, ముక్కుసూటి వ్యక్తితం హరికృష్ణదని లోకేశ్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details