Tributes to Paritala Ravindra పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయన స్మృతికి తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. సీమ నేలపై రౌడీ రాజకీయాలకు చెక్ పెట్టి ప్రజాకంటకుల వాకిళ్లలో పసుపు జెండాను రెపరెపలాడించి పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించిన ధీశాలి పరిటాల రవీంద్ర అని చంద్రబాబు కొనియడారు. జీవితమంతా ప్రజల కోసమే బతికిన ఆత్మీయుడు పరిటాల రవీంద్ర అని అన్నారు. ఫ్యాక్షనిజం పడగలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ పేదల పక్షాన నిలిచి పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన వ్యక్తి అని తెలిపారు. తెలుగుదేశం నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని లోకేశ్ కొనియడారు.
Tributes to Paritala Ravindra ప్రజల కోసమే బతికిన ఆత్మీయుడు పరిటాల రవీంద్ర - పరిటాల రవీంద్రపై నారా లోకేశ్
Tributes to Paritala Ravindra పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయన స్మృతికి చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులర్పించారు. జీవితమంతా ప్రజల కోసమే బతికిన ఆత్మీయుడు పరిటాల రవి అని గుర్తు చేశారు. తెలుగుదేశం నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.
చంద్రాబు, నారా లోకేశ్