భారత లెజండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూత పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పరుగుల్లో చిరుతను తలపించే మిల్కాసింగ్ మృతి అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరుగు పోటీల్లో భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. గొప్ప అథ్లెట్ను దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
మిల్కా సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మిల్కా సింగ్ ఆత్మకు శాంతి కలగాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. దేశం ఓ గొప్ప క్రీడాకారుడ్ని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మిల్కా సింగ్ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని లోకేశ్ అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.