ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశప్రజలందరికీ చంద్రబాబు, లోకేశ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే జాతీయ వీరులకు అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు అన్నారు. ఎందరో దేశభక్తుల త్యాగఫలమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్య్రమన్నారు. సమరయోధుల, అమరవీరుల పోరాటాన్ని స్మరించుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని చేసుకుందామని లోకేశ్ పిలుపునిచ్చారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు చేసుకోవాలని సూచించారు.

చంద్రబాబు, లోకేశ్
చంద్రబాబు, లోకేశ్

By

Published : Aug 14, 2020, 11:44 PM IST

వ్యవస్థలకు తూట్లు పొడవడం, హక్కులు కాలరాయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, స్వేచ్ఛా స్వతంత్రాలను హరించడం వ్యక్తి ద్రోహమే కాకుండా సమాజద్రోహం కూడా అని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హక్కులను నిలబెట్టుకోవడం, స్వేచ్ఛా స్వాతంత్య్ర కాపాడుకోవడం, వ్యవస్థలను-రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే జాతీయ వీరులకు అందించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ చంద్రబాబు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన స్వేచ్ఛకే మూలధనమన్న ఆయన వాళ్లందరినీ స్మరించుకుని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇదన్నారు. అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖిత పూర్వక రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా భారతావనిని తీర్చిదిద్దారని కొనియాడారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

త్యాగధనుల్ని స్మరించుకుందాం : లోకేశ్

దేశ ప్రజలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స‌మ‌ర‌యోధులు, అమ‌ర‌వీరుల పోరాట స్ఫూర్తితో ‌దేశ‌మంతా ఒక్కటై...బ్రిటిష్ అరాచ‌క పాల‌నపై ఉద్యమించి స్వాతంత్య్రాన్ని సాధించిన పండ‌గ రోజు ఆగ‌స్టు 15 అని లోకేశ్ తెలిపారు. మువ్వన్నెల జెండా రెప‌రెప‌ల్లో వందేమాత‌రం, జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతాల‌ను ఆల‌పిస్తూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల‌ను తెచ్చిపెట్టిన మ‌హ‌నీయుల‌ను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. త్యాగ‌ధ‌నుల ఆశ‌యాలు నెర‌వేరుస్తామ‌ని ప్రతిన‌బూనుదామన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా జాగ్రత్తలు తీసుకుని వేడుక‌లు జరుపుకుందామని లోకేశ్ అన్నారు.

ఇదీ చదవండి :మైక్రో ఆర్ట్స్ లో రాణిస్తున్న మౌళేశ్... బియ్యంపై జాతీయగీతం

ABOUT THE AUTHOR

...view details