''భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించడమే కాదు... ఆ హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పిన దార్శనికుడు'' అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళి అర్పించారు. ఉక్కు సంకల్పంతో జాతీయ ఐక్యతను సాధించిన సుస్థిర జాతి నిర్మాత అని కొనియాడారు. వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు.
ఉక్కుమనిషికి చంద్రబాబు, లోకేష్ నివాళి - లోకేష్
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విటర్లో నివాళి అర్పించారు.
babu lokesh tribute to vallabhai patel
లోకేష్ నివాళి...
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విటర్లో అంజలి ఘటించారు. ''భారత జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించి, భారత రాజ్యాంగ రచనాకమిటీ సభ్యునిగా, ప్రాథమిక హక్కుల రూపకల్పనకు విశేష కృషి చేసి, సమైక్య భారతావనికోసం ఉక్కు సంకల్పంతో పోరాడిన యోధుడు సర్దార్ వల్లభ భాయ్ పటేల్'' అని కీర్తించారు.