ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్సీలకు ఆర్థిక స్వావలంబనతోనే అంబేడ్కర్​కు నివాళి'

నూతన సమాజాన్ని నిర్మించడంలో రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ కృషి సాటిలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా... చంద్రబాబు, లోకేశ్ ట్విటర్​లో నివాళులు అర్పించారు.

ambedkar jayanthi
'అంబేడ్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్'

By

Published : Apr 14, 2020, 10:56 AM IST

'అంబేడ్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్'

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. సామాజిక ఐకమత్యానికి అడ్డుగా నిలుస్తున్న కులాల భావన నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ఆధారపడే నూతన సమాజాన్ని నిర్మించటంలో... అంబేడ్కర్ చేసిన కృషి సాటిలేనిదని చంద్రబాబు కొనియాడారు. బాబా సాహెబ్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్ అన్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌.. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. ఎస్సీలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారానే అంబేడ్కర్‌కు ఘననివాళి ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు అన్నారు.

భారత రాజ్యాంగ రచయిత, దళితజనులలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత బీ.ఆర్.అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. నవభారత నిర్మాతగా, గొప్ప దేశభక్తునిగా, సామాజిక విప్లవకర్తగా ఆ మహనీయుడు చేసిన కృషిని స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు.

'అంబేడ్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్'

ABOUT THE AUTHOR

...view details