ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమాజానికి అండగా నిలిచేందుకు.. హుస్సేన్ త్యాగస్ఫూర్తిని అందుకుందాం' - మొహర్రం శుభాకాంక్షలు

త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం గుర్తు చేశారు. శాంతి స్థాప‌న‌కు ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.

CBN
మొహర్రం పండుగ శుభాకాంక్షలు

By

Published : Aug 9, 2022, 12:57 PM IST

మొహమ్మద్ ప్రవక్త మనుమడు... హజ్రత్ ఇమామ్ హుస్సేన్... ప్రాణత్యాగానికి ప్రతీక మొహ‌ర్రం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాడుతూ ప్రాణాలతో సహా సర్వస్వాన్నీ అర్పించిన హుస్సేన్ త్యాగాన్ని అందరూ గుర్తుచేసుకోవాలని చంద్రాబాబు సూచించారు. ధర్మపరిరక్షణ కోసం సమాజానికి అండగా నిలిచేందుకు... హుస్సేన్ త్యాగస్ఫూర్తిని అందుకోవాలని అన్నారు. శాంతి స్థాప‌న‌కు ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులని స్మరించుకుందామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details