సూపర్ స్టార్ కృష్ణకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా 40ఏళ్లకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణ రాణించారని చంద్రబాబు ప్రశంసించారు. మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందారన్నారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ప్రశాంతతను అందివ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఎన్టీఆర్, అక్కినేనితో సరిసమానంగా సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సేవలందించారని నారా లోకేశ్ కొనియాడారు. కృష్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో ఘనమైన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.