తెలంగాణ.. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సందర్శించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మిని, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర... సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు - దేవాన్ష్, ఆర్యన్‌కు అక్షరాభ్యాసం
తెదేపా అధినేత చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు బాసర సరస్వతిదేవిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్, బాలకృష్ణ చిన్న కుమార్తె కుమారుడు ఆర్యన్‌కు అక్షరాభ్యాసం చేయించారు.
![బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు BASARA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10877745-368-10877745-1614922911810.jpg)
BASARA
చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్‌కు సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం జరిపించారు. బాలకృష్ణ మరో మనవడు ఆర్యన్‌కూ అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూజలు చేపట్టారు.
బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు
ఇదీ చదవండి:సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
Last Updated : Mar 5, 2021, 3:23 PM IST