తమ అక్రమాలు మీడియాలో వస్తాయనే వైకాపా ప్రభుత్వం మీడియాపై ఆంక్షల జీవో తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ పనితీరుపై ఆయన మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రభుత్వ తప్పుడు నిర్ణయమని.. ఇలాంటి చర్యలతో తెలుగు తన ఉనికిని కోల్పోతుందని అన్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఆంగ్ల మాధ్యమం ఇబ్బందికరమన్నారు.
జేసీ, అఖిలప్రియ, చింతమనేనిని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు.అగ్రిగోల్డ్‌పై సీఎం జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధార్మిక సంస్థల పరిరక్షణలో అలసత్వం వహిస్తున్నారని... అన్యమతస్థులపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందన్న చంద్రబాబు.. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగానే దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.