రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం సాధిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయపూడి దీక్షా శిబిరంలో రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రలో ఉండే ప్రజల కోసం పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఉండాలని పని చేశానని...ప్రాచీన నగరానికి చిహ్నం అమరావతి అని పునరుద్ఘాటించారు. దిల్లీలో అమరావతి ఐకాస నాయకులు అందరినీ కలుస్తున్నారని.. అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని విశాఖలో అంటున్నారని చంద్రబాబు తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఒకే మాట... ఒకే రాజధాని ఉండాలన్నారు.
5 కోట్ల మంది ఒక వైపు.. జగన్ మరోవైపు: చంద్రబాబు - రాయపూడి దీక్షా శిబిరానికి చంద్రబాబు న్యూస్
అమరావతిని శ్మశానం, ఎడారి అంటుంటే చాలా బాధేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వస్తే మునిగిపోతుందని.. పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
chandrababu about capital amaravathichandrababu about capital amaravathi
Last Updated : Feb 5, 2020, 3:09 PM IST