తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీల అవస్థలకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం తమిళనాడుకు వలస వెళ్లామని అందులో కొందరు కూలీలు చెబుతున్నారు. ఇప్పుడు లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ కూలీలు వీడియోలో వాపోయారు. తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకుంటున్నారు. వాళ్లకి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం ఇస్తారని చంద్రబాబు నిలదీశారు.
వారికి ఏం సమాధానం చెబుతారు జగన్: చంద్రబాబు - ఏపీ వలస కూలీల ఇబ్బందులు
తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో బియ్యం కోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోందంటూ వారు ఓ వీడియోలో తమ బాధను చెప్పుకున్నారు. ఆ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. వారికి ఏం సమాధానం ఇస్తారని సీఎం జగన్ను ప్రశ్నించారు.
![వారికి ఏం సమాధానం చెబుతారు జగన్: చంద్రబాబు chandra babu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6965569-800-6965569-1588001803628.jpg)
chandra babu