Chandra Babu Review: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారిగా పార్టీ ఇంచార్జ్‌లతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖీ భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు రాజమండ్రి, పెదకూరపాడు, మంత్రాలయం, చీరాల, కోడుమూరు, కనిగిరి ఇంచార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇతర పార్టీల నేతలు తెదేపాలో చేరికలపై.. జరుగుతున్న ప్రచారాన్ని ఇంచార్జ్ ఎంఎం కొండయ్య సమీక్ష సమావేశంలో చంద్రబాబుకు వివరించారు. పార్టీ ఇంచార్జ్‌గా కొండయ్యను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరు చేరినా.. కొండయ్యతో కలిసి పని చెయ్యాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని.. వారికే టిక్కెట్లు ఇవ్వడం అనే చర్చను చంద్రబాబు కొట్టిపారేశారు. పార్టీకి మెరుగైన సేవలను అందించాలని కొండయ్యకు సూచించారు.
పార్టీలో ఎవరు చేరినా నియోజకవర్గ ఇంచార్జ్తో కలిసి పని చేయాలి: చంద్రబాబు - Bapatla
Chandra Babu: చీరాలలో పార్టీలో ఎవరు చేరినా నియోజకవర్గ ఇంచార్జ్తో కలిసి పని చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు నియోజకవర్గాల వారిగా పార్టీ ఇంచార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు