సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు చేపట్టిన భూ సంస్కరణలు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేశాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరిగా విశిష్ట స్థానం సంపాదించుకున్న దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని గుర్తు చేశారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
నవ భారత నిర్మాతల్లో ఒకరు పీవీ: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు తెదేపా అధినేత చంద్రబాబు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరిగా పీవీ విశిష్ట స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.

chandra babu