ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

" దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డ సింధు" - pv sindu

ప్రపంచ టోర్నీలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ట్విటర్ వేదికగా పీవీ సింధుని ప్రశంసించిన చంద్రబాబు..ఇవాళ ఫోన్ చేసి అభినందించారు.

పీవీ సింధు

By

Published : Aug 28, 2019, 10:36 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా సింధును ప్రశంసించారు. బ్యాడ్మింటన్​లో ఆమె విజయాలు స్ఫూర్తి దాయకాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. దేశానికి, తెలుగు జాతికీ గొప్ప పేరు ప్రతిష్ఠలు తేవాలని, ఆమె స్ఫూర్తితో వర్ధమాన క్రీడాకారులు మరింత రాణించాలని చంద్రబాబు కోరారు. సింధు తల్లితండ్రులను, కోచ్ గోపీచంద్​కు ప్రత్యేకంగా అభినందించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details