ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలి'

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచే శాసనసభలో ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబరు 2430ను రద్దు చేసి మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సర్కారు తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

chandra babu on suspensio on media
మీడియాల సస్పెన్షన్​పై చంద్రబాబు

By

Published : Dec 13, 2019, 8:01 PM IST

మీడియాపై ఆంక్షలు సరికావన్న చంద్రబాబు

రాష్ట్రంలో మీడియా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2430ని రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ జీవోపై గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ ఆదేశాలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఆంక్షల పేరుతో మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వైకాపా సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.

ఇష్టారీతిన వ్యవహరిస్తోంది

సభాపతి, మంత్రులను ముఖ్యమంత్రి జగన్ డమ్మీలుగా మార్చి ప్రతి అంశంపైనా ఆయనే స్పందిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక వైకాపా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. విద్యుత్‌ స్తంభాలను సైతం వదలకుండా పార్టీ రంగులు వేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. విద్యా బోధనలో ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకమంటూ తెదేపాపై ప్రభుత్వం బురద జల్లుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తమ హయాంలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామంటే వైకాపా అడ్డుపడిందన్నారు.

దాడులు మంచిది కాదు

ప్రజాస్వామ్య బద్ధంగా తాము నిరసన తెలుపుతుంటే వందల మంది మార్షల్స్‌ను ప్రభుత్వం రంగంలోకి దించిందని చంద్రబాబు తప్పుబట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్న ఆయన.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరూ నాశనం చేయలేరన్నారు. ఈ తరహా పోకడలు మంచిది కాదని హితవు పలుకుతూనే మీడియాపై ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'

ABOUT THE AUTHOR

...view details