ఎనిమిది నెలల్లో 7 లక్షల పింఛన్లకు కోత పెట్టడం మోసమని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే పింఛన్లు పెరగాల్సిందిపోయి తగ్గడం వింతగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.6 వేలకు అదనంగా రూ.12,500 ఇస్తామని రైతులకు మొండిచేయి చూపించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీఎం జగన్ మోసాలు చేయడం మానలేదు' - chandra babu fires on jagan
ముఖ్యమంత్రి జగన్ యువత, మహిళలు, వృద్ధులను మోసం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పింఛన్లలో కోత పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు.
పింఛన్ల తగ్గింపుపై చంద్రబాబు
యువతను మోసం చేశారు
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి జగన్ ఏమార్చారని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇప్పటికీ మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదని చంద్రబాబు విమర్శించారు.